calender_icon.png 12 January, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి గణిత ప్రతిభ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థి

11-12-2024 08:31:07 PM

మంచిర్యాల (విజయక్రాంతి): జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలో నిర్వహించిన జిల్లా స్థాయి గణిత ప్రతిభ పోటీలలో మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల పదవ తరగతి విద్యార్థి నల్ల చరణ్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి గణిత శాస్త్ర ప్రతిభా పరీక్షకు ఎంపికైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న బుధవారం తెలిపారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం మంచిర్యాల జిల్లా కమిటీ నిర్వహించిన జిల్లా స్థాయి గణిత పరీక్షలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయిన చరణ్ ను ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు హరీష్ దేశ్ పాండే, ధనలక్ష్మి, శ్రీలత తదితరులు పాల్గోన్నారు.