పీఠాధిపతికి వివరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9(విజయక్రాంతి): వేములవాడ ఆలయ విస్తరణ పను ల విస్తరణకు శృంగేరిపీఠం అనుమతి కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసుల బృందం సో మవారం శృంగేరికి వెళ్లారు. ఆలయంలో చేపట్టనునున్న పనుల వివరాలు, నిర్మించనున్న నమూనాలతో పీఠాధిపతి విధిశేఖర భారతి సామికి వివరించారు. ఆయన సూచనలు, సలహాలతో ఆగమ శాస్త్రం అనుసరించి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. తరలోనే పీఠాధిపతి సందరిం చి, అభివృద్ధి పనులకు సూచనలు ఇస్తారని పేర్కొన్నారు. ఈవో వినోద్‌రెడ్డి, స్తపతి వల్లీనాయకం, ఈఈ రాజేశ్, ప్రధాన అర్చకులు నమలికొండ ఉమేష్‌శర్మ, శరత్‌శర్మ, డీఈ రఘునందన్ తదితరులు ఉన్నారు.