13-02-2025 12:00:00 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు, పట్టణాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నల్లగొండ కలెక్టరేట్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని బుధవారం ఆమె పరిశీలించారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకే పట్టణాలు, మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు ఒకటని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఉన్నారు.