21-03-2025 12:00:00 AM
టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు
కామారెడ్డి అర్బన్, మార్చి 20( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 23న ఆదివారం ఉదయం 10 గంటలకు ఉచిత మోడల్ ఎంసెట్ పరీక్షను వి ఆర్ కె అకాడమీ సహకారంతో నిర్వహిస్తున్నట్లు టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, టిఎన్‌ఎస్‌ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ బోండ్ల అంజల్ రెడ్డి లు గురువారం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు,అంజల్ రెడ్డి లు మాట్లాడుతూ ఉచిత మోడల్ ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రావాలని, ఈ పరీక్ష రాయడం ద్వారా భవిష్యత్తులో జరగనున్న ఇంజనీరింగ్,మెడిసిన్ ఎంట్రన్స్ పైన అవగాహన ఏర్పడుతుందని,అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంస పత్రాలను,అభినందన జ్ఞాపికలను అందజేస్తామని అన్నారు.
ఈ పరీక్ష నిర్వహించడానికి సహకరిస్తున్న విఆర్కే అకాడమీకి టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ ఎంట్రన్స్ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు డాక్టర్ బాలు 9492874006,దత్తాద్రి 94408 62825,నవీన్ 9133676076 లకు సంప్రదించాలని అన్నారు.