calender_icon.png 10 January, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ చాయ్ వాలీ!

10-10-2024 12:00:00 AM

బిల్‌గేట్స్ మెచ్చిన నాగ్‌పూర్ డాలీ చాయ్ వాలా గురించి అనేక వార్తలు వచ్చాయి. అతడు చాయ్ తయారు చేస్తున్న విధానం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో దేశవిదేశాల్లో డాలీ చాయ్ వాలా బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఒక మోడల్ సైతం టీ షాప్ ఓపెన్ చేసింది. ఆమె పేరు సిమ్రాన్ గుప్తా. ‘మోడల్ చాయ్ వాలీ’ అనే పేరుతో లక్నోలో ఒక టీ స్టాల్ స్టార్ట్ చేసింది.

మోడల్ చాయ్ వాలీ అంటూ టీ స్టాల్లో ఆమె చాయ్ తయారు చేస్తున్న వీడియోలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆమె తయారు చేస్తున్న టీపై నెటిజన్లు  భిన్నరకాలుగా స్పందిస్తు న్నారు. ఈ వీడియోకు దాదాపు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 

ది హంగ్రీ పంజాబీ అనే ఫుడ్ బ్లాగింగ్ చానల్ ఆమె టీ షాప్ వీడియో పోస్ట్ చేసింది. మోడల్ చాయ్ వాలీ అంటూ టీ స్టాల్లో ఆమె తయారు చేస్తున్న వీడియోను షేర్ చేసిం ది. అందులో ఆమె తన జుట్టుతో రకరకాలుగా ఫోజులిస్తున్న తీరుకు నెటిజన్లు భిన్నరకాలుగా స్పం దిస్తున్నారు.