102 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత
సూర్యాపేట, జూన్ 9 (విజయక్రాంతి) : జిల్లా పరిధిలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన సుమారు రూ.20 లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ శాఖ రికవరీ చేసింది. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ’మొబైల్ రికవరీ మేళా’లో జిల్లా ఎస్పీ కె.నర సిం హ బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి ల్లాలో ప్రతి నెలా 100కు పైగా ఫోన్లు రికవరీ చేస్తున్నామని, గడిచిన ఏడాది కాలంలో 1,7 44 మొబైల్స్ను బాధితులకు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం మొబైల్స్ ద్వారా ఆర్థిక మోసాలు జరిగే అవకాశం ఉన్నందున ఫో న్లు పోగొట్టుకుంటే వెంటనే సిఈఐఆర్ పోర్ట ల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
డిజిటల్ అరెస్టులు అబద్ధం.. అత్యాశకు పోవద్దు:
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సం పాదన, తక్కువ వడ్డీ రుణాలు, దర్యాప్తు సం స్థల పేరిట వచ్చే ’డిజిటల్ అరెస్ట్’ బెదిరింపులను నమ్మి సైబర్ మోసగాళ్ల బారిన పడవ ద్దని ఎస్పీ హెచ్చరించారు. సమాజంలో అ సాంఘిక కార్యకలాపాలను ప్రశ్నించే ప్రతి పౌరుడూ యూనిఫాం లేని పోలీసు అని, నే రాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో ఏఎస్పీ రవీందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.






