calender_icon.png 5 January, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో అంతరిక్షం నుంచి మొబైల్ కాల్స్

03-01-2025 01:24:36 AM

  • శాటిలైట్ లాంచింగ్ విజయవంతమైతే చాలు
  • భారత్ అమెరికా ఆధ్వర్యంలో పరిశోధన

న్యూఢిల్లీ, జనవరి 2: అంతరిక్ష పరిశోధనలు, శాటిలైట్స్ లాంచింగ్‌లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తున్నది. విజయపరంపరను కొనసాగిస్తూ 2025లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నది. రానున్న ఆరు నెలల్లో ఇస్రో అతిపెద్ద ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నది. భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఇస్రో అత్యంత ఖరీదైన శాటిలైట్ ‘ఎన్‌ఐఎస్‌ఏఆర్’ ప్రయోగించనున్నది.

ఒకవేళ ఆ ప్ర యోగం విజయవంతమైతే మున్ముం దు వ్యోమగాములు అంతరిక్షం నుం చి భూమిపై తమకు నచ్చిన చోటికి మొబైల్ కాల్స్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. మిషన్‌లో అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్ అనే సంస్థ కీలక పాత్ర పోషిస్తు న్నది. శాటిలైట్ పర్వతాలు, సముద్రాలే కాదు.. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు.. అంత రిక్షం నుంచి కూడా కాల్స్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.