నిమజ్జనం సందర్భంగా సర్వీసులు పెంపు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచు తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే శుక్రవారం ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యా ర్థం ఈ నెల 17, 18 తేదీలలో రాత్రిపూట కూడా నిరంతరాయంగా సర్వీసులను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ షెడ్యూల్..
17వ తేదీ రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్(నాంపల్లి) నుంచి లింగంపల్లికి సర్వీసు నడపనున్నారు. అదేవిధంగా రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, 18వ తేదీ అర్ధరాత్రి 12.10 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు, 12.30 గంటలకు హైదరాబాద్ నుంచి లింగంపల్లికి, 1.50 గంటలకు లింగంపల్లి నుంచి హైదరాబాద్ వరకు, 2.20 గంటలకు ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌కు, 3.30 గంటలకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు, తెల్లవారుజామున 4.00 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఎం ఎంటీఎస్ సర్వీస్‌లను నడపనున్నారు.