calender_icon.png 26 December, 2024 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎం అండ్ ఎం లాభం 35 శాతం జంప్

08-11-2024 01:13:19 AM

ముంబై, నవంబర్ 7: ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికరలాభం ఈ క్యూ2లో 35 శాతం వృద్ధిచెంది రూ. 3,171 కోట్లకు చేరింది. నిరుడు క్యూ2లో కంపెనీ రూ. 2,346 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈ సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 34,436 కోట్ల నుంచి రూ. 37,924 కోట్లకు పెరిగింది.

తమ ఆటో, వ్యవసాయ ఉత్పత్తుల విభాగాల లాభం 23 శాతం పెరిగిందని, ఆటో విభాగం కన్సాలిడేటెడ్ నికరలాభం 40 శాతం వృద్ధితో రూ. 1,423 కోట్లకు చేరినట్లు ఎం అండ్ ఎం గురువారం తెలిపింది. ఈ త్రైమాసికంలో తమ యుటిలిటీ వాహన విక్రయాలు రికార్డుస్థాయిలో 1.36 లక్షల యూనిట్లకు పెరిగినట్లు వెల్లడించింది.