calender_icon.png 22 December, 2024 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అదుపులో ఎమ్మార్పీఎస్ నేతలు

11-10-2024 01:34:43 PM

రంగారెడ్డి, (విజయ క్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి.... కొందుర్గు పర్యటన నేపథ్యంలో షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నేతలను పోలీసులు అదుపులోనికి తీసుకుంటున్నారు.  కొందుర్గు ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఆనెగల్ల ఆనంద్ మాదిగ, శ్రీకాంత్ మాదిగ లను అదుపు లోనికి తీసుకుని జిల్లెడ్ చౌదరిగూడ పొలీస్ స్టేషన్ కు తరలించారు. వర్గీకరణ విషయంలో ముందుగా అమలు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వడాన్ని తప్పుపడుతూ రాష్ట్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యంగా పోలీసులు వారిని తీసుకుంటున్నారు.