calender_icon.png 21 September, 2024 | 11:13 PM

సీసీఎల్‌ఏకు చేరిన ఎమ్మార్వో నిర్వాకం

26-07-2024 01:17:53 AM

  • ఒకరి పట్టా భూమిని మరొకరికి కన్వర్షన్ చేసిన వైనం
  • విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించిన సీసీఎల్‌ఏ కమిషనర్

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 25 (విజయక్రాంతి): మేడ్చల్ ఎమ్మార్వో శైలజ నిర్వాకం సీసీఎల్‌ఏకు చేరింది. గిర్మాపూర్‌లో ఓ కుటుంబంలోని వారసులందరికీ దక్కాల్సిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా కొందరికే రాసిచ్చిన సంగతి మరువకముందే, మేడ్చల్ ఎమ్మార్వోకు సంబంధించి మరో అవినీతి వ్యవహా రం సీఎంవో వరకు వచ్చింది. మేడ్చల్ మం డలం రాజబొల్లారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 207లో ఉన్న తమ పట్టా భూమిని ఇతరులకు కన్వర్షన్ చేశారని త్రివిక్రం రాథోడ్ అనే వ్యక్తి సీఎంవోలో 20 24 జూలై 9న ఫిర్యాదు చేశారు.

ఆ భూమి తమదేనని కలెక్టర్ నిర్ధారణ చేసినప్పటికీ తహసీల్దార్ ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ తమ భూమిపై నాలా కన్వర్షన్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నా రు. దీంతో విచారణ చేయాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం మేడ్చ ల్ కలెక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా గిర్మాపూర్‌లో ఓ ఒంటరి మహిళ భూమికి సంబంధించి ‘విజయక్రాంతి’ పత్రికలో వచ్చిన కథనంపై కూడా విచారణ చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ పెద్దల నుంచి మేడ్చల్ కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి.