జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని కొండపోచమ్మ ఆలయంలో 23వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలతో పాటు దేవుళ్ళను కూడా ఒట్టు పెడుతూ మోసం చేస్తున్నారని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మహిళా అధ్యక్షురాలు మాజీ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, కావ్య దర్గయ్య, తాజా మాజీ సర్పంచ్ రజిత రమేష్, నాయకులు స్వామి, ఐలయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.