19-04-2025 08:53:11 PM
పటాన్ చెరు: ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలోని జగన్నాథ ఆలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరితో కలిసి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ బీజేపీ నాయకుల ఆహ్వానం మేరకు జగన్నాథ ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి సతీమణి గోదావరితో కలిసి జగనన్నాథుని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి, సరిత, మేఘనా రెడ్డి, రవీందర్ రెడ్డి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.