calender_icon.png 23 January, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి: ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

02-09-2024 04:26:53 PM

వైఎస్సార్ పేద ప్రజల పెన్నిధి

జగిత్యాల,(విజయక్రాంతి): వైఎస్సార్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దేవుడిగా నిలిచిపోయారని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలోని ఇందిరా భవన్ లో  వైఎస్ ఆర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ... జగిత్యాల వైఎస్సార్ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం, బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్ల కోసం  కృషి చేశారని, మిషిన్ భగీరథ లేనప్పుడు జగిత్యాల ప్రజల దాహం తీర్చడానికి ప్రతిఇంటికి రూ. 200 లకే నల్ల కనక్షన్ ను రూ.25 కోట్ల గ్రాంట్ సమకూర్చి నీటి సమస్యను తీర్చే విధంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేశారని ఆయన గుర్తుచేశారు.

పాదయాత్ర ద్వారా కర్షకుల కష్టాలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం చేసి రైతులకు ఉచిత విద్యుత్ అందించారన్నారు. విత్తనాల సబ్సిడీ, ఐకేపీ సెంటర్ గాని ప్రతి పథకం రైతులకు, పేదలకు అందించేలా ప్రవేశ పెట్టి అందరి గుండెల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని జీవన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ వర్ధంతిలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చేర్మన్లు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి,  పీసీసీ కార్యదర్శి బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్,మాజీ ఎంపీపీ రమేష్ బాబు, కౌన్సిలర్ దుర్గయ్య, సీనియర్ కాంగ్రెస్ కొండ్ర జగన్, మహంకాళి రాజన్న,మోయిజ్,  మొగిలి,గుండ మధు,సీనియర్ కాంగ్రెస్, యూత్ కాంగ్రె నేతలు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.