18-02-2025 07:05:15 PM
హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితలప్రణవ్ బాబు..
హుజురాబాద్ (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 42 నియోజకవర్గాల కంటే హుజురాబాద్ నియోజకవర్గం లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వాలని కోరారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు కాంగ్రెస్ కృషి చేస్తుంటే బిజెపి వాటిని నిర్వీర్యం చేస్తుంది అన్నారు.
గడిచిన సంవత్సర కాలంలో 55 వేల ప్రజలకు ఉద్యోగాలు కల్పించామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి సాయి శక్తుల పాటుపడతానని, పట్టబద్ర సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఓటర్ల ఇంటికి వెళ్లి కార్యకర్తలు సంక్షేమ పథకాల అమలు తీరు వివరించాలని సూచించారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టభద్రులనుఇబ్బందుల గురిచేసింది అన్నారు. నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు.