13-02-2025 10:43:06 PM
బైంసా (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. భైంసాలో గురువారం బిజెపి పట్టణ, మండల, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించడం లేదన్నారు.
సంవత్సర కాలంలోనే రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందంటే, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అద్దం పడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో దేశం సుభిక్షంగా ఉందని, ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని, రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి విజయ డంక మోగించి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.