calender_icon.png 24 February, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం పరిశీలన

24-02-2025 07:52:50 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): ఈనెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికలకు సంబంధించిన మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సోమవారం బూర్గంపాడు ఎస్సై నాగబిక్షం, తహశీల్దార్ ముజాహిద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలోని వసతులను గురించి కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వారితో పాటు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింహారావు, సెక్రటరీ ప్రభాకర్, కళాశాల ప్రిన్సిపల్ చీన్యా, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.