calender_icon.png 30 October, 2024 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిమ్స్‌కు ఎమ్మెల్సీ కవిత

19-07-2024 12:05:00 AM

జూలై 22 వరకు కస్టడీ పొడగింపు

న్యూఢిల్లీ జూలై 18: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ కేసులో కవిత కస్టడీని పొడగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఆమెకు అస్వస్థత నేపథ్యంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. జైలు అధి కారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. తన ఆరోగ్య సమస్యల గురించి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రెండు రోజుల క్రితం జైలులో కవిత అస్వస్థతకు గురికాగా... ఆమెను దీన్‌దయాళ్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.