calender_icon.png 16 April, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్క నాటిన ఎమ్మెల్సీ

14-04-2025 05:59:39 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ ఇంటి ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహనీయుల జయంతి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడం గణపతి, బెజ్జూర్ మాజీ జడ్పీటీసీ  పంద్రం పుష్పాలత, టిపిసిసి మెంబర్ అర్షద్ హుస్సేన్, మహేష్,మురళి గౌడ్,రాణా ప్రతాప్ సింగ్, కాళికోట రమణయ్య, కాంగ్రెస్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు శివరామ్ నాయక్, జిల్లా ప్రధాన కర్యదర్శి బుర్సా వెంకటేష్ ,యూసుఫ్ ,ఎన్నం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.