calender_icon.png 10 March, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిరిడి సాయి క్షేత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి

10-03-2025 07:43:24 PM

పిట్లం (విజయక్రాంతి): ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తొలిసారిగా పింగిళి శ్రీపాల్ రెడ్డి ఏకాదశి సందర్భంగా సోమవారం రోజు పిట్లం మండలంలోని రాంపూర్ కలాన్ కుర్తి  గేటు వద్ద గల శిరిడి సాయి క్షేత్రముకు విచ్చేసిన సాయి క్షేత్ర వ్యవస్థాపక గురువులు లక్ష్మీరమణ స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. ఆ తర్వాత  పిఆర్టియు తెలంగాణ  పిట్లం మండల శాఖ తరపున ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి తదితరులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో పాటు పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, మహుబాబాద్ జిల్లా అధ్యక్షులు సతీశ్, పత్రిక సంపాదకులు ప్రసాద్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిషన్, పిట్లం మండల అధ్యక్షులు బన్సీలాల్, ప్రధాన కార్యదర్శి సి నారాయణ, రాష్ట్ర బాధ్యులు సంతోష్ రెడ్డి రవీందర్ జెట్టి, రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డిఇ గణేష్ సార్, సాయి సేవ సమితి సభ్యులు కృష్ణ, శ్రీనివాస్, జలంధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.