calender_icon.png 6 January, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిపై ఎమ్మెల్సీ అసభ్యకర వ్యాఖ్యలు

21-12-2024 02:43:42 AM

బెంగళూరు, డిసెంబర్ 20: బీజేపీ ఎ మ్మెల్సీ సీటీ రవి కర్ణాటక శాసనమండలిలో గురువారం మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీహెబ్బాల్కర్‌ను వేశ్య అని సం బోధిస్తూ అసభ్యకరమైన సంజ్ఞలు చేశారు. ఆమె శాసనసభ చైర్మన్‌తో పాటు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్సీ రవిపై కేసు నమో దు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హైకోర్టు నిందితుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో షా వ్యాఖ్యలపై శాసనమండలిలో చర్చ జరగ్గా.. ఎమ్మెల్సీ తన ప్రసంగంలో రాహుల్‌ను మాదకద్రవ్యాల వ్యసనపరుడని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.