11-03-2025 12:42:31 PM
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లోని ఖానామెట్‌లో భూ వివాదం చోటుచేసుకుంది. ఖానామెట్ సర్వే నంబర్ 11/37 లో కొద్ది రోజులుగా భూ పంచాయతీ నడుస్తోంది. భూమి తమదే అంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. సరిహద్దు చుట్టూ కంచె వెస్తుండగా ఎమ్మెల్సీ నవీన్ రావు(BRS MLC Naveen Rao) వర్గం అడ్డుకుంది. ఇరు వర్గాలకు సర్దిచెప్పిన మాదాపూర్ పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో(Madhapur DCP office) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన రావు ఫిర్యాదు చేశారు. తన భూమి కబ్జాకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నవీన్ రావు ఎమ్మెల్యే కృష్ణరావుతో కలిసి వచ్చి ఫిర్యాదు చేశారు.