calender_icon.png 16 January, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

14-07-2024 12:25:31 AM

లోకల్ క్యాడర్ జీటీఏ నేతల డిమాండ్

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన టీచర్లు సమానమేనని అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేసి న వ్యాఖ్యలను శనివారం లోకల్ క్యా డర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం వీరాచారి, లక్ష్మీకాంత్‌రెడ్డి  ఓ ప్రకటనలో ఖండిం చారు. 2018లో ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై హైకోర్టు 2019 జూన్ 4న స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకే ఎవరి మేనేజ్‌మెం ట్‌లో వారికి ఉద్యోగోన్నతులు, బదిలీలు జరుగుతున్నాయన్నాయని స్ప ష్టం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మె ల్సీ దాచిపెడుతూ అర్థరహిత వ్యాఖ్య లు చేయడం సరికాదన్నారు. రా జ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ యాక్ట్ ఏర్పడిందని, దాని ప్రకారం జిల్లా పరిషత్, మండల పరిషత్ టీచర్లందరూ వారి మేనేజ్‌మెంట్ల కింద ప నిచేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పా రు. ప్రభుత్వ పరిధిలో వారు పనిచేయడానికి రాజ్యాంగంలోని ఏ అం శంమూ అనుకూలంగా లేదన్నారు.