calender_icon.png 4 March, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లిని తొలుత ఇదే రూపంలో రూపొందించాం

09-12-2024 02:29:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం మద్దతు ప్రకటించారు. పోరాటాలు, సంస్కృతి, త్యాగాలకు ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహం అన్నారు. తెలంగాణ పోరాటానికి వారసత్వంగా విగ్రహం కనిపిస్తోందని, తెలంగాణ తల్లిని తొలుత ఇదే రూపంలో రూపొందించామని ఆయన పేర్కొన్నారు. విగ్రహంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని, ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహంపై మాజీ సీఎం కేసీఆర్ సొంత నిర్ణయమన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ రూపొందించిన తెలంగాణ తల్లి వి గ్రహం నిరాండంబరంగా ఉందన్నారు. విగ్రహాన్ని రూపొందించిన కళాకారులకు, ప్రభుత్వానికి కోదండరామ్ అభినందనలు తెలిపారు.