23-02-2025 07:40:56 PM
టిజిఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మూల నాగిరెడ్డి..
బూర్గంపాడు (విజయక్రాంతి): తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాంని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మూల నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కోదండరాం ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. తెలంగాణలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాల చేసిన వ్యక్తి మహనీయుడు కోదండరాం ఈ సందర్భంగా గుర్తు చేశారు.