19-02-2025 01:19:01 AM
సూర్యాపేట ఫిబ్రవరి 18: సూర్యాపేటలో జరుగుతున్న రెండో అతిపెద్ద లింగమంతుల జాతరలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య యాదవ్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి బోనం ఎత్తి దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల్ని గాలికి వదిలి ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలంలో ఇప్పటికీ 30 సార్లు ఢీల్లీలోని ఆ పార్టీ పెద్దలను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనమయ్యారని విమర్శించారు.
రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయలే దన్నారు. ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని అన్నారు.