11-03-2025 12:28:37 PM
రాజేంద్రనగర్: బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్ రావు(Gattu Ramachandra Rao )ను ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) మంగళవారం ఉదయం పరామర్శించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మణికొండ లోని అల్కపురి కాలనీ లోని ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అంతా సర్దుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గట్టు రామచందర్ రావుకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సీతారాం ధూళిపాళ్ల, వర్కింగ్ ప్రెసిడెంట్ ధనరాజ్, మహిళ నేత రూపా రెడ్డి, సుమ, కీర్తి లతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.