21-04-2025 12:00:00 AM
ఖమ్మం, ఏప్రిల్ 20( విజయక్రాంతి ):-జన జాగృతి నాయకురాలు, టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖ మ్మం పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువుర్ని పరామర్శించి, భరోసా కల్పించారు.
సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ ను ఆమె పరామర్శించారు. తర్వాత సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరావు ను కూడా పరామర్శించారు.అనంతరం ఖమ్మం లో జాగృతి నాయకురాలు గట్టు అరుణ కుమారుడి వివాహా రిసెప్షన్ కు హాజరై నూతన దంపతులు సాయి వివేక్ - పావని లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ వద్దిరా జు రవి చంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.