కామారెడ్డి,(విజయక్రాంతి): నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా బాన్సువాడలో బీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ కవిత రాక సందర్బంగా ఘనస్వాగతం పలకడానికి బీఆర్‌ఎస్ నాయకులు సర్వం సిద్దం చేశారు. 12 గంటలకు నిజామాబాద్‌లోని ప్రిమియర్‌లీగ్ క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం తబ్లిగీ జమాత్ వేదికను సందర్శించనున్నారు.అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం బడాపహడ్, పెద్ద గుట్ట దర్గాను సందర్శించనున్నారు. బాన్సువాడలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడానున్నారు. ఎమ్మెల్సీ కవిత రాక సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జర్గకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు.