22-03-2025 08:11:11 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నట్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ శనివారం తెలిపారు. బాన్సువాడ పట్టణంలో సోమవారం ముస్లిం మైనార్టీ సోదరులకు పెద్ద మజీద్ (జమ మజీద్) వద్ద నియోజకవర్గ మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని మైనార్టీ సోదరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జుబేర్ కోరారు.