హైదరాబాద్: నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC Kavitha) కవిత రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులో అరెస్ట్, బెయిల్ పై విడుదల, న్యాయ పోరాటం వంటి పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత ఆదివారం నిజామాబాద్ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఆదివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్(KCR)ను ఎదర్కొనే ధైర్యం లేక తనపై, కేటీఆర్(KTR)పై కేసులు పెట్టారని ఆరోపించారు. తాము తప్పు చేయలేదు.. భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నేతలు(BRS leaders) నిప్పు కణికల్లా బయటికి వస్తారని వెల్లడించారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే అక్కడా కేసులు పెడుతున్నారు.. రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పనవసరం లేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.