calender_icon.png 1 April, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలభైరవస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

29-03-2025 07:58:41 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాల భైరవ స్వామి ఆలయాన్ని శనివారం ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, సదాశివనగర్ మాజీ జడ్పీ సభ్యుడు రాజేశ్వరరావు స్వాగతం పలికారు. ఆమె వెంట జిల్లా మాజీ గ్రంథాల సంస్థ ఛైర్మన్​ సంపత్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కపిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.