యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన యాదాద్రి గిరి ప్రదక్షణ మహోత్సవంలో పాల్గొన్నారు. సహచర మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కలసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.