హైదరాబాద్: తాము చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాగునూరు జెడ్పీ హైస్కూల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు తెరలేపిందని ద్వజమెత్తారు.
ప్రజా పాలను అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు, ప్రజలను నిర్బందిస్తూ, తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయని ద్వజమెత్తారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటులను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వమని కవిత పేర్కొన్నారు.