calender_icon.png 13 March, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను చాటిన నాయకురాలు

13-03-2025 02:54:40 PM

ఘనంగా  ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు : మాజీ మంత్రి వనమా

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పై వహించి, బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను రాష్ట్ర నలుమూలల చాటి, ప్రజాసేవకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంకిత మైందని బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు(Former Minister Vanama Venkateswara Rao) అన్నారు. గురువారం ఎమ్మెల్సీ కవిత జన్మదినం(MLC Kavitha's birthday celebrations) సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, బతుకమ్మ పండుగను రాష్ట్రం నలుమూలల వ్యాప్తింపచేసిన ఉక్కు మహిళ ఎమ్మెల్సీ కవిత అని, ఎన్ని అక్రమ  కేసులు పెట్టిన వాటిని ఎదుర్కొంటూ ప్రజా సేవ చేస్తున్న కవితకు  జన్మదిన శుభాకాంక్షలు  తెలిపారు. ఈ  కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేందర్ గారు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బుఖ్య సోనా, మాజీ కౌన్సిలర్ రుక్మైందర్ బండారి, అంబుల వేణు, వేముల ప్రసాద్, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, టీబీజీకే నాయకకులు కాపు కృష్ణ, పాల్వంచ పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.