calender_icon.png 14 March, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

13-03-2025 06:34:53 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు ఈట రాకేష్, నియోజకవర్గ అధ్యక్షులు పుల్లూరి మౌనిక్  ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు  అరేపల్లి వంశీనాథ్,  రెడ్డవేణ శ్రీనాథ్, కార్తీక్, బండారి రేవంత్,  కందుల స్వరాజ్, సల్మాన్, ఇందూరి సాయి, తాటిపల్లి అరవింద్ ,ముక్క సాయి, సల్ల సాయి, వెంకట్ సాయి, సల్మాన్, ప్రవీణ్,సుమంత్, మహంతి, పింగిలే గౌతమ్, రాజ్ కుమార్,  బబ్బి, కరణ్, సాగర్, బి ఆర్ ఎస్ వి టౌన్ అధ్యక్షులు అరుణ్, మైనారిటీ టౌన్ అధ్యక్షులు అలీ భాయ్, టౌన్ జనరల్ సెక్రెటరీ ఖలీం గారు, నాయకులు మురుకూరి  శ్రావణ్, మద్దెల గోపి, చంద్ర శేఖర్, ధర్మేందర్, దాగం చరణ్, ఖలీల్ ,మహేందర్,చరణ్,యశ్వంత్, బబ్బుల్, పాల్గొన్నారు.