calender_icon.png 22 April, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ జడ్పిటిసి నివాసంలో తేనేటి విందుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

21-04-2025 09:13:34 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భద్రాచలం పర్యటనలో భాగంగా మార్గమధ్యమంలో సోమవారం బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని స్థానిక మాజీ జెడ్పిటిసి నివాసంలో తేనెటీ విందుకు హాజరయ్యారు. మాజీ జడ్పిటిసీ దంపతులు కామిరెడ్డి శ్రీలత రామ కొండా రెడ్డి లు స్థానిక నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులను కార్యకర్తలను పరిచయం చేస్తూ ఆమెతో ఫోటో సేషన్ లో పాల్గొన్నారు.ఆతిథ్యాన్ని స్వీకరించి అందరిని ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఈనెల 27న జరగబోయే బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ పండుగకు గులాబీ దండు అంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఆమెతో పాటు ఎమ్మెల్సీలు తాత మధు, గాయత్రి రవి, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీకృష్ణ, మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, మాజీ సర్పంచులు సిరిపురపు స్వప్న , వెంకటరమణ, భారతి, శ్రావణి ,వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ ఉద్యమ నాయకులు పోడియం నరేందర్, కురుసం వెంకటేశ్వర్లు,గాద వెంకటరెడ్డి, తోకల సతీష్,గంగరాజు,దివాకర్ రెడ్డి , శ్రీకాంత్ రెడ్డి,సాని కొమ్ము రామచంద్రారెడ్డి, నరేష్ ,నరేష్,లోకి రెడ్డి సంతోష్ రెడ్డి,వెంకట్ రెడ్డి,రామకృష్ణ,గోడేటి సుధాకర్,మందా ప్రసాద్, చైతన్య రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.