calender_icon.png 19 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రికి రానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

19-04-2025 06:30:58 PM

భద్రాచలంలో దైవ దర్శనం అనంతరం వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్న కవిత..

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 20, 21 తేదీలలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం లింగాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 7 గంటలకు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అనంతరం హరిత హోటల్లో ఉదయం 9 గంటలకు తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. సమావేశం అనంతరం భద్రాచలం నుండి బయలుదేరి ఉదయం 10 గంటలకు పర్ణశాల పుణ్యక్షేత్రానికి బయలుదేరి వెళ్తారు. కవిత రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలకనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ రామకృష్ణ సునీల్ తెలిపారు.