calender_icon.png 27 February, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ ఎందుకు అబద్దాలు చెబుతున్నారు?

27-02-2025 01:24:12 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)పై ఆరోపణలు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రేవంత్ రెడ్డి అంతులేని అబద్దాలు చెప్పారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్ర అన్నారు. మోడీ డైరెక్షన్(Modi direction)లో రేవంత్ పనిచేస్తున్నారు. ప్రతీ విషయంలో బీజేపీతో రేవంత్  కలిసి పనిచేస్తున్నారని కవిత వెల్లడించారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ లపై కేసులు పెడుతామని రేవంత్ అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉంది కాబట్టే తాము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్నే విమర్శిస్తున్నారని తెలిపారు.

బీజేపీ - కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైంది..

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిన్న ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ పై కేసులు పెడుతామని అంటున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా ఇంకో ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్దాలు చెబుతుంది, కానీ కాగ్ నివేదిక(CAG Report) ప్రకారం ఏ నెల కూడా రూ. 2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదని తెలింది. 6500 కోట్లు కడుతున్నామని రేవంత్ ఎందుకు అబద్దాలు చెబుతున్నారు? అబద్దాలు పదేపదే చెబితే నిజమవుతాయేమోనన్న భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నాడని కవిత ఎద్దేవా చేశారు. మరి ఈ అబద్దపు లెక్కలు ఎందుకు చెప్తున్నట్లు? ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తున్నట్లు? అని కవిత ప్రశ్నించారు.