calender_icon.png 24 October, 2024 | 2:35 PM

పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నా

24-10-2024 12:49:54 PM

కాంగ్రెస్ అగ్రనేతలకు జీవన్ రెడ్డి లేఖ

పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకులేకపోతున్నా

తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నా.. లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నా 

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. అభివృద్ధి నేపంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి మీడియా సమావేశం అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నా.. లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది.. సుస్థిర ప్రభుత్వం ఉన్నా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని జీవన్ రెడ్డి తప్పుబట్టారు. పార్టీ ఫిరాయింపుల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ అరాచకాలను అడ్డుకున్నాను... పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కార్యకర్తలపై పెత్తనం చెలాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయించిన వారికి ప్రభుత్వంలో పెద్దపీట వేయడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు.

పార్టీ ఫిరాయింపులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఠా నాయకులు అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డిని సంతోష్ అనే యువకుడు చంపారు.. ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సంతోష్ పనిచేశారు.. ఇప్పుడేమో కాంగ్రెస్ ముసుగులో గంగారెడ్డిని హత్య చేశారని స్పష్టంచేశారు. సంతోష్ గతంలో బీఆర్ఎస్ అండ చూసుకుని రెచ్చిపోయాడని గుర్తుచేశారు. గంగారెడ్డిని మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా తన తరుఫున ప్రతిపాదించామని జీవన్ రెడ్డి తెలిపారు. ఎవరి అండ చూసుకుని గంగారెడ్డిని సంతోష్ చంపారు? అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.