calender_icon.png 8 January, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే అనుచరుల మధ్య బాహాబాహీ

07-01-2025 07:32:14 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలో జరిగిన నిజామాబాద్ పార్లమెంటరీ పరిధి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాటలు జరిగాయి. మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని కెఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంటరీ పరిధి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి తెలంగాణ ఇన్చార్జి మనిషితో పాటు ముఖ్య నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సభ ప్రాంగణంలోని స్వాగతం వద్ద ఏర్పాటుచేసిన పార్టీ రిజిస్టర్ లో సంతకం చేయడానికి పుస్తకంలో చూడగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు అందులో లేకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేదికపై కనపడటంతో అయినా మరింత అసహనానికి గురై వెనుతిరిగి వెళ్తుండగా నాయకులు కార్యకర్తలు ఆయనను బతిమాలి నచ్చజెప్పడంతో సమావేశానికి హాజరై వేదికపై కూర్చున్నారు. మొత్తానికి నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయింది.