calender_icon.png 3 February, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ‘ఎన్నికల కోడ్’అమలు

03-02-2025 12:00:00 AM

రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు వాయిదా

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 2: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల కార ణంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రులో ఫిబ్రవరి 8, 9,10  తేదీలలో నిర్వ హించతలపెట్టిన రాష్ట్ర స్థాయి క్రీడా,   సాంస్కృతి కోత్స వాలను వాయిదా వేస్తున్నట్లు తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్ తెలిపారు. ఆదివారం మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ భారీ స్థాయిలో నిర్వహించి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించామన్నారు.

ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఎవరు ఏలాంటి కార్యక్రమాలు చేయకూడదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.ఈ క్రీడా  సాంస్కృతి కోత్సవాలను భారీ స్థాయిలో అందరూ పాల్గొనే విధంగా ,కన్నుల పండుగగా  నిర్వహించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు ఏర్పాట్లు అన్ని పూర్తి అయి నప్పటికీ ఎన్నికల కోడ్ పరిగణలోకి తీసు కొని వాయిదా వేయక తప్పడం లేదని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ సహకరించాలని కోరారు.