23-02-2025 08:03:12 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): విద్యారంగం బలోపేతం, ఎస్జీటీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా ఎన్నికల బరిలోకి దిగినట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సంకినేని మధుసూదన్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్‌జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించకపోవడాన్ని తప్పుపట్టారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఎన్నికల్లో కనీస అర్హత లేకుండా, ఉపాధ్యాయులుగా పనిచేయకున్న కార్పొరేట్ శక్తులు పోటీ చేస్తున్నారని ఆక్షేపించారు. మేధావులైన పట్టభద్రులు ఆలోచించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎస్‌జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య, నాయకులు షకీల్ అహ్మద్, శివ శేఖర్, యూసుఫ్, అమృత్ ఉన్నారు.