11-02-2025 06:48:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 27న నిర్వహించనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఓట్ల జాబితాను ప్రదర్శించడం జరిగిందన్నారు.
ఓటర్లు ఏదేని ఒక గుర్తింపు కార్డుతో ఓటు హక్కును వేసుకోవాలన్నారు. ఎన్నికల నియమాలని కచ్చితంగా పాటించాలని, ఉల్లంగిస్తే చర్యలు ఉంటాయన్నారు. పోలింగ్ కౌంటింగ్ రోజు ఎదురు నిర్వహించే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని మాస్టర్ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రత్న కళ్యాణి, ఆర్డీవో కోమల్ రెడ్డి, అధికారులు ఉన్నారు.