25-02-2025 07:01:16 PM
ఎమ్మార్వో దిలీప్ కుమార్..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజవుగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని స్థానిక ఎమ్మార్వో దిలీప్ కుమార్ అన్నారు. మంగళవారం గర్ల్స్ హై స్కూల్ లోని పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎమ్మార్వో కుమార్ దిలీప్ కుమార్, సీఐ నరేందర్ సంబంధిత అధికారులతో పరిశీలించారు. అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ... ఫిబ్రవరి 27న ఉదయం 8:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా పెట్టాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు, పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలని, ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వాటిని నిరోధించాలన్నారు. ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సత్తీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.