24-02-2025 02:48:49 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలోని ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ సోమవారం విడుదల చేసింది. మార్చి 29వ తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం తెలంగాణలో ఐదు, ఆంధ్రప్రదేశ్ లో ఐదు మంది పదవీకాలం మార్చి 29న ముగియనుండడంతో ఆ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.
మార్చి 3న నోటీఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు ఉంటుంది. మార్చి 20వ తేదీన పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ కూడా సాయంత్రం 5 గంటల తర్వాత నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ పదవీకాలం మార్చి 29వ తేదీన ముగుయనుంది.
🔸ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు షెడ్యూల్
🔸మార్చి 3న నోటిఫికేషన్ విడుదల
🔸మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన
🔸నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు
🔸మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్
🔸ఈ నెల 29తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీకాలం