27-02-2025 06:57:52 PM
పోలింగ్ 76% జరిగినట్లు ఎన్నికల అధికారి వెల్లడి
ఎన్నికల సరళిని పరిశీలించిన, ఏసీపి అమందర్ రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి
ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేసిన పియుఆర్టియు టీచర్స్
చేగుంట,(విజయక్రాంతి): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఏసీపీ మహేందర్ రెడ్డి(District ACP Mahender Reddy), వివిధ పార్టీల నాయకులు పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు అంజిరెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పిఆర్టియు మండల అధ్యక్షుడు గజగట్ల నాగరాజు, కార్యదర్శి తిరుపతి రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చల్ల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి శంకర్, విజయసారెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.