calender_icon.png 27 February, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ... క్యూలో ఉన్నవారికే అవకాశం

27-02-2025 04:41:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీకి,  ఉమ్మడి వరంగల్-ఖమ్మం- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 4 గంటలలోపు క్యూలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. ఇవాళ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.