calender_icon.png 20 February, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

17-02-2025 07:42:14 PM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి..

కొండపాక: పట్టాభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం మను చౌదరి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనో చౌదరి సోమవారం మాట్లాడుతూ... ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధనలను, ఎన్నికలలో పాల్గొనే అధికారులు, ఎన్నికల మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. ముఖ్యంగా ఓటు వేసే ఓటర్లు అందరూ చదువుకున్నవారు, బ్యాలెట్ పేపర్ తో ఓటు ఎలా వేయాలో పూర్తి అవగాహన ఉన్నా కూడా ఓటు వేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు జాగ్రత్త పడాలని అన్నారు.

పోలింగ్ కేంద్రం బయట ఓటు ఎలా వేయాలో చూపే ఫ్లెక్సీ ని ఏర్పాటు చేయాలని అన్నారు. పి ఓ డైరీ మెంటేనెన్స్ చేయడం, రిపోర్ట్స్ సమయానికి అందించాలని, పోలింగ్ ఏజెంటు విధులు, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ ల సీలింగ్ తదితర అన్ని రకాల విధులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి ఎలాంటి రిమార్కు రాకుండా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, మాస్టర్ ట్రైనర్, ఎన్నికల పిఓ లు తదితరులు పాల్గొన్నారు.