calender_icon.png 28 February, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

28-02-2025 02:16:19 AM

పట్టభద్రుల నియోజకవర్గంలో 70.42 శాతం 

ఉపాధ్యాయ నియోజకవర్గంలో 91.90 శాతం పోలింగ్

కరీంనగర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో 70.42 శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 91.90 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం పట్టభద్రుల ఓటర్లు 3,55,519 మంది ఉండగా 2,50,106 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉపాధ్యాయ నియోజకవర్గం లో 27,088 మంది ఓటర్లు ఉండగా 24,895 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల నియోజక వర్గంలో అత్యధికంగా జయశంకర్ భూపల్లి జిల్లాలో 79.50 శాతం, అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో 64.64 శాతం పోలింగ్ నమోదయింది. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గంలో అత్యధికంగా మెదక్ జిల్లాలో 95.03 శాతం, అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 82,10 శాతం పోలింగ్ నమోదయింది.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 499 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 274 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు పోలింగ్ మందకొడిగా కొనసాగింది.

పట్టభద్రుల నియోజకవర్గంలో 10 గంటలకు 7.1, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 12.72 శాతం పోలింగ్ నమోదయిం ది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గంలో 19.20 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 33.98 శాతం పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గంలో 40.61 శాతం, ఉపాధ్యాయ నియో జకవర్గంలో 63.49 శాతం పోలింగ్ నమోదయింది.

జిల్లాల వారీగా...

కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో 71,545 మంది ఓటర్లు ఉండగా 46,247 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 64.64 శాతం పోలింగ్ నమోదయింది. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 4305 మంది ఓటర్లు ఉండగా 3871 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 89.92 శాతం పోలింగ్ నమోదయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి 68.73 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 22,397 ఓట్లకుగాను 15,394 మంది తమ ఓటు హక్కు వి నియోగించుకున్నారు.

ఉపాధ్యాయ నియోజకవర్గంలో 950 ఓట్లకుగాను 899 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 94.63 శాతం పోలింగ్ నమోదయింది. చందుర్తి, రుద్రంగి, తంగళ్లపల్లిలో వంద శాతం పోలిం గ్ నమోదయింది. పెద్దపల్లి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 31,037 మంది ఓటర్లు ఉండగా 21,259 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 68. 50 శాతం పోలింగ్ నమోద యింది.

ఉపాధ్యా య నియోజకవర్గంలో 1111 మంది ఓటర్లు ఉండగా 1049 మంది ఓటు హక్కు ను వినియోగించుకోగా 94.42 శాతం పోలింగ్ నమోదయింది. జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో 35,281 మంది ఓటర్లు ఉండగా 24,862 మంది ఓటు హ క్కును వినియోగించుకోగా 70, 47 శాతం పోలింగ్ నమోదయింది. ఉపాధ్యాయ ని యోజకవర్గంలో 1769 మంది ఓటర్లు ఉండ గా 1635 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 92.43 శాతం పోలింగ్ నమోదయింది.